దర్యాప్తు సంస్థ ఈడీ డైరెక్టర్గా సంజయ్ కుమార్ మిశ్ర (ED Director SK Mishra) పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. మిశ్ర పదివీ కాలం పెంపునకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బుధవారం ఈ ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నవంబరు 18 వరకు (ED Director SK Mishra) ఈ పొడగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈడీ డైరెక్టర్గా మిశ్ర తొలిసారి 2018 నవంబరు 19న (ED Director SK Mishra) నియమితులయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2020 నవంబరు 13న మరోమూడేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు కాగా న్యాయస్థానం పిటిషనర్ వాదనను సమర్థించింది.