తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈసారి చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం' - new farm laws

వ్యవసాయం చేయాల్సిన రైతులను దిల్లీలో కూర్చోబెట్టడం తగదని వ్యాఖ్యానించారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​. రైతుల ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడిన పవార్​.. రాష్ట్రాలను సంప్రదించకుండా సాగు చట్టాలను తీసుకురావడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయన్నారు.

Govt bulldozed three farm laws; Agriculture can't be run sitting in Delhi: Pawar
'ఈసారి చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం'

By

Published : Dec 29, 2020, 7:38 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ) అధినేత శరద్​ పవార్​. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే ఈ సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులను దిల్లీలో కూర్చోబెట్టడం తగదని వ్యాఖ్యానించారు. దీని వల్ల వ్యవసాయ పనులు ఆగిపోతాయన్నారు.

దిల్లీ సరిహద్దుల్లో నెలరోజులకు పైగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. ఈ క్రమంలో రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్న మంత్రుల బృందానికి పవార్​ ప్రశ్నలు సంధించారు. అధికార పార్టీ.. వ్యవసాయం, రైతుల సమస్యలపై లోతైన అవగాహనతో చర్చలు జరపాలని హితవు పిలికారు.

ఈసారి విఫలమైతే..

ప్రధాని నరేంద్ర మోదీ.. అన్నదాతల ఆందోళనలపై ప్రతిపక్షాలను తప్పుబట్టడం మానేసి.. నిరసనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు పవార్​. రైతు సంఘాలతో కేంద్రం మరోసారి జరపనున్న చర్చలు విఫలమైతే.. 40 కర్షక సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతామని హెచ్చరించారు.

'ఈ విధంగా కాదు'

'మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేయాలనుకుంది. అయితే ఈ విధంగా కాదు' అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్​ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు పవార్​. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రంగంలోని నిపుణులతో చర్చించి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ సంస్కరణలు చేపట్టాలన్నారు. అయితే ఇవేమి లేకుండా సొంత మెజారిటీతో చట్టాలు తీసుకొచ్చారని.. దీంతో సమస్యలు మొదలయ్యాయన్నారు.

ఇదీ చూడండి:'ఠాగూర్​ గడ్డపై మత రాజకీయాలు సాగవు'

ABOUT THE AUTHOR

...view details