దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ రోగులకు ప్రాణవాయువు సక్రమంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. పరిశ్రమలకు అందించే ఆక్సిజన్ సరఫరాపై నిషేధం విధించింది. ఏప్రిల్ 22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే.. వీటిలో 9 పరిశ్రమలకు మినహాయింపునిచ్చింది.
కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతుండటం వల్ల.. మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు.