కరోనాకు సంబంధించి బి.1.617 రకం వేరియంట్‌ను భారత్ రకం అని పేర్కొంటూ ఉన్న సమాచారాన్ని వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం.. సామాజిక మాధ్యమ సంస్థలకు సూచించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు లేఖ రాసిన కేంద్ర ఐటీ శాఖ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ భారత్ రకం అనే పదాన్ని వాడలేదని స్పష్టం చేసింది.
''భారత్ వేరియంట్' సమాచారాన్ని తొలగించండి'
బి.1.617 వేరియంట్‌ను భారత్ రకం అని పేర్కొంటూ ఉన్న సమాచారాన్ని తొలగించాలని సామాజిక మాధ్యమాలకు సూచించింది కేంద్రం. ఈ మేరకు ఆయా సంస్థలకు లేఖ రాసింది.
భారత్ వేరియంట్, వైరస్
భారత్ రకం వేరియంట్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోందని తప్పుడు సమాచారం ఆన్‌లైన్ వేదికగా వ్యాప్తి చెందుతోందని ఐటీ శాఖ తెలిపింది. బి.1.617 రకం వేరియంట్‌పై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చిందని గుర్తు చేసింది.
ఇదీ చదవండి:టూల్‌కిట్ వివాదం- ట్విట్టర్‌కు కేంద్రం వార్నింగ్!
Last Updated : May 22, 2021, 6:51 AM IST