తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాములు - రక్షణ మంత్రిత్వ శాఖ

భారత నావికాదళానికి రూ. 43వేల కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)' సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

rajnath singh
రాజ్‌నాథ్ సింగ్

By

Published : Jun 5, 2021, 5:17 AM IST

భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)' సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టకుకు 'పీ -75 ఇండియా' పేరిట త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌పీ జారీకి కావాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి.

జలాంతర్గాముల స్పెసిఫికేషన్లు సహా ఇతర అవసరాలను రక్షణ మంత్రిత్వ శాఖ, భారత నావికాదళం సహా ఇతర బృందాలు కలిసి పూర్తిచేశాయని తెలిపాయి. సముద్ర జలాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

డీఏసీ ఆమోదం..

రూ. 6 వేల కోట్లు విలువ చేసే రక్షణ కొనుగోళ్లు జరపాలనే ప్రతిపాదనకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది. రాజ్​నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ కార్యాలయం పేర్కొంది.

ఇదీ చదవండి :ఇండియన్​ ఆర్మీపై ఫేక్ వెబ్​సైట్- వ్యక్తి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details