ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23ను 'పరాక్రమ్ దివస్'గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేతాజీ స్ఫూర్తి, ఆయన నిస్వార్థ సేవకు గౌరవసూచకంగా 'పరాక్రమ్ దివస్' జరపాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఇకపై 'పరాక్రమ్ దివస్'గా నేతాజీ జయంతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (జనవరి 23)ని 'పరాక్రమ్ దివస్'గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై 'పరాక్రమ్ దివస్'గా నేతాజీ జయంతి
అయితే కొన్ని రోజుల క్రితమే పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.
ఇదీ చదవండి :'మిషన్ బంగాల్'పై భాజపా కీలక భేటీ