తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బతికున్నానని నిరూపించుకునేందుకు తిప్పలు!

ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకోసం వెళ్తాం? ఏదైనా ధ్రువీకరణ పత్రం కోసమో.. ఇంకేదైనా అనుమతుల కోసమో వెళ్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాను జీవించే ఉన్నానని చెప్పుకోవడానికి వెళ్తున్నాడు. 'నేనింకా చనిపోలేదు మొర్రో' అని అధికారులతో మొత్తుకుంటున్నాడు.

government-figures-killed-person-alive-in-ashoknagar
బతికున్నానని నిరూపించుకునేందుకు తిప్పలు!

By

Published : May 27, 2021, 7:40 PM IST

మధ్యప్రదేశ్​ అశోక్​నగర్​లోని చందేరీ తహసీల్​ గ్రామానికి చెందిన శివకుమార్.. తాను సజీవంగా ఉన్నానని నిరూపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు. తాను ఇంకా చనిపోలేదని చెబుతూ.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.

బాధితుడు శివకుమార్

అసలు విషయమేంటంటే ప్రభుత్వ పత్రాల్లో శివకుమార్ మృతి చెందినట్లు నమోదై ఉంది. అధికారుల పొరపాటు కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత వ్యక్తి తనకు సంబంధించిన ధ్రువపత్రాలను చూపిస్తూ.. సమాచారాన్ని సరిచేయాలని అధికారులను అభ్యర్థిస్తున్నాడు.

ప్రభుత్వ అధికారితో శివకుమార్
గుర్తింపు పత్రాలను చూపిస్తున్న బాధితుడు

"నేను అధికారిక గణాంకాలలో మరణించినట్లు ఉంది. దీనిపై డిప్యూటీ కలెక్టర్​కు సమాచారం అందించాను. కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు."

-శివకుమార్, బాధితుడు

ఇదీ చదవండి-50 ఏళ్లలో 117 తుపాన్లు.. 88 శాతం తగ్గిన ప్రాణనష్టం

ABOUT THE AUTHOR

...view details