తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గూగుల్ 'వసంత రుతువు డూడుల్' సూపర్​!

వసంత రుతువు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో.. గూగుల్​ ఓ అందమైన డూడుల్​ను రూపొందించింది. వసంత రుతువు జూన్​ 21న ముగియనుంది.

google doodle symbolizing spring season
వసంతరుతువుకు సూచకంగా గూగుల్​ సూపర్ డూడుల్!

By

Published : Mar 20, 2021, 12:45 PM IST

వసంత రుతువులో పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. శీతాకాలానికి, వేసవికి సంధికాలం. ఈ వసంత రుతువు ప్రారంభానికి సూచకంగా ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ అందమైన డూడుల్‌ను రూపొందించింది. ఉత్తరార్ధగోళంలో ఇవాళ ప్రారంభమైన వసంత రుతువు జూన్‌ 21న ముగియనుంది.

గూగుల్​ డూడుల్

ఈ నేపథ్యంలో ముళ్ల ఉడుత రంగురంగుల పూలను తీసుకెళ్తుండగా తేనెటీగలు వెంట పడుతున్నట్లుగా ఉన్న యానిమేటెడ్‌ డూడుల్‌ను గూగుల్ రూపొందించింది. డూడుల్‌లోని పుష్పాలకు గూగుల్‌ తన లోగో అక్షరాలకు ఉండే ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగులను ఉపయోగించింది.

ఇదీ చదవండి:హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం

ABOUT THE AUTHOR

...view details