తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gold Theft at Jewellery Shop in Hyderabad : సికింద్రాబాద్‌లో 'గ్యాంగ్' సీన్ రిపీట్.. ఐటీ అధికారులమంటూ గోల్డ్ చోరీ - జ్యువెల్లరీ షాపులో బంగారం చోరీ

Gold Theft at Jewellery Shop in Hyderabad : తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన గ్యాంగ్ మూవీ చూశారా..? అందులో ఓ సీన్‌లో తాము ఐటీ అధికారులమని చెబుతూ హీరో సూర్య తన గ్యాంగ్‌తో కలిసి ఓ బంగారం షాపులో సోదాలు చేస్తాడు. అచ్చం అలాంటి సీనే రిపీట్ అయింది సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో. పట్టపగలు.. నడిరోడ్డు మీద ఉన్న బంగారం షాపులో సిబ్బంది కళ్ల ముందే 1.7 కిలోల బంగారం దోచుకెళ్లారు.

Gold Theft at Jewellery Shop in Hyderabad
Gold Theft at Jewellery Shop in Hyderabad

By

Published : May 27, 2023, 6:59 PM IST

Updated : May 27, 2023, 7:43 PM IST

Gold Theft at Jewellery Shop in Hyderabad : అది హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న ఓ బంగారం నగల షాపు. అప్పుడే ఆ దుకాణాన్ని తెరిచారు. ఒక్కొక్కరుగా కస్టమర్లు వస్తున్నారు. అదే సమయంలో కొంతమంది సూటుబూటు వేసుకుని ఆఫీసర్లలా కనిపిస్తున్న వారు షాపులోకి వచ్చారు. రాగానే హడావుడిగా.. గోల్డ్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి.. షాపంతా చెక్ చేయాలంటూ సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు. ఏదో తనిఖీ చేస్తున్నట్టు హంగామా చేశార. కాసేపటి తర్వాత 1.7 కిలోల బంగారానికి సంబంధించి ట్యాక్స్ కట్టలేదనే సాకు చూపుతూ ఈ గోల్డ్ సీజ్ చేస్తున్నామని చెప్పి ఆ బంగారం తీసుకుని ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అక్కడి నుంచి ఉడాయించారు. ఇదంతా చూస్తుంటే ఏదో సినిమాలో సీన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. హైదరాబాద్‌లోని ఓ నగల దుకాణంలో ఇవాళ ఇదే సీన్ రిపీట్ అయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే మోండా మార్కెట్‌లో బాలాజీ జ్యూవెలరీ షాపు ఉంది. ఈ షాపు యజమాని రివెన్ మధుకర్.. పాత బంగారాన్ని కొనుగోలు చేసి దానిని శుద్ది చేసి సమీపంలోని సిద్దివినాయక జువెల్లరీస్‌కు విక్రయిస్తూ ఉంటాడు. సొంత ఊళ్లో ఏదో పని ఉండటంతో మధుకర్ వారం క్రితం ఊరెళ్లాడు. వెళ్తూ వెళ్తూ.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే తన బావమరిది వికాస్ ఖేడ్కర్‌కు తన షాపును చూసుకోమని బాధ్యత అప్పగించి వెళ్లాడు. అప్పటి నుంచి వికాస్ బాలాజీ జ్యూవెలరీ షాపును చూసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం షాపును తెరిచాడు వికాస్. కాసేపటికే ఐదుగురు వ్యక్తులు ఈ షాపులోకి వచ్చారు. సూటు బూటు ధరించి ఆఫీసర్లలాగా కటింగ్ ఇస్తూ.. గోల్డ్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారంటూ షాపులోని సిబ్బందిని బెదిరించారు. షాపులో అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తూ సిబ్బందిని అక్కడి నుంచి పక్కకి వెళ్లగొట్టారు. అనంతరం షాపులో ఉన్న బంగారాన్ని పరిశీలిస్తూ.. సోదాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ.. చివరకు 1.7(1700 గ్రాములు) కిలోల బంగారానికి సంబంధించి ట్యాక్స్ కట్టలేదని.. అందుకే ఆ గోల్డ్ స్వాధీనం చేసుకుంటామని చెెప్పారు. నోటీసులు ఇవ్వకుండానే అక్కడి నుంచి ఆ బంగారు బిస్కెట్లు తీసుకుని ఉడాయించారు. వెళ్తూ వెళ్తూ సిబ్బందిని షాపులోనే ఉంచి తలుపులు వేసి వెళ్లారు. వికాస్ ఇతర దుకాణదారులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తీశారు.

Gold Theft at Jewellery Shop in Secunderabad : అనంతరం వికాస్ తన బావ మధుకర్‌కు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పాడు.విషయం తెలుసుకున్న షాపు ఓనర్ ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులకు ఐటీ అధికారులు వచ్చి గోల్డ్ సీజ్చేసిన సంగతి చెప్పాడు. అయితే వారు.. ఐటీ అధికారులు అలా వచ్చి తనిఖీలు చేయరని.. ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో అతడికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు యజమాని. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు చూసి.. ఆ ఐదుగురు వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులను తేల్చారు. ఐటీ అధికారుల్లాగా నటించి బంగారం కొట్టేశారని ధ్రువీకరించారు. దోపిడీ తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

Gold Biscuits Theft at Jewellery Shop in Secunderabad : ఈ చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆరుగురికి ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామని.. వీలైనంత త్వరగా ఈ నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

‘‘మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన రివెన్‌ మధుకర్‌ బవర్‌ నాలుగు నెలల క్రితమే మోండా మార్కెట్‌లో బంగారం షాపు పెట్టుకున్నారు. మధుకర్‌ సొంతూరు వెళ్లడంతో అతని బావమరిది వికాస్‌ ఖేదకర్‌ బాలాజీ గోల్డ్‌ షాప్‌లో తయారీ పని చూసుకుంటున్నాడు. వికాస్‌ ఖేదర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో మరో గోల్డ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. చోరీ జరిగిన సమయంలో షాపులో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. ఆ సమయంలో వచ్చిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఐడీ కార్డులు చూపించి కార్ఖానాలో ఉన్న 17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు) ఎత్తుకెళ్లారు. బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత పనివాళ్లను లోపలే పెట్టి బయట గడియపెట్టారు. బంగారం డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇది తెలిసిన వాళ్ల పనేనని భావిస్తున్నాం’’ - చందన దీప్తి, ఉత్తర మండల డీసీపీ

Last Updated : May 27, 2023, 7:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details