దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. చిన్నాపెద్ద అందరూ.. రంగులకేళిలో మునిగితేలారు. కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో సామూహిక వేడుకలపై ఆంక్షలు విధించినప్పటికీ.. నిబంధనలు పాటిస్తూ రంగోళి జరుపుకొన్నారు. దేవతామూర్తులు, సంప్రదాయ వేషధారణల్లో హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథురలో హోలీ వేడుకలు సంప్రదాయబద్ధంగా చేపట్టారు. వేల సంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో రంగులపండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.