Glass in Stomach: బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. అతని కడుపులో గ్లాసు ఉందని గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి తొలగించారు.
తీవ్ర కడుపు నొప్పితో జిల్లాలోని మడిపుర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు ఓ 55ఏళ్ల వ్యక్తి. వెంటనే డాక్టర్లు అతనికి ఎక్స్-రే తీశారు. బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్లుగా అందులో గుర్తించారు. గ్లాస్‌ను తీయడానికి మొదట ఎండోస్కోపిక్ ద్వారా ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో చివరగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. బాధితున్ని అడగ్గా.. చాయ్ తాగేప్పుడు గ్లాస్ మింగేశానని చెప్పాడు. కానీ సన్నగా ఉండే ఆహార నాళంలో గ్లాసు పట్టే అవకాశం లేదని వైద్యులు అంటున్నారు.