టీఆర్పీ స్కాంకు సంబంధించి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి మూడు రోజుల ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయరాదని ముంబయి పోలీసులను బాంబే హైకోర్టు ఆదేశించింది. అరెస్టు చేయాలంటే తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది.
టీఆర్పీ కేసు విచారణను జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీశ్ పిటాలే నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టింది. పోలీసుల దగ్గర అర్ణబ్ గానీ, ఆయన టీవీ ఉద్యోగులు గానీ స్కాంకు పాల్పడినట్లు ఆధారాలే లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసుకు సంబంధించి అర్ణబ్ స్కాం చేసినట్లు తగిన ఆధారాలు లేవని తేల్చింది.