ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలికను ఇద్దరు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి ఎట్టకేలకు విడిపించుకున్న బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిందంతా చెప్పింది. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజమ్గఢ్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగింది:ఆజమ్గఢ్ జిల్లా రాణికీ సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇంటి వరండాలో బాలిక నిద్రిస్తోంది. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఇద్దరు యువకులు ఆ ఇంటి వద్దకు చేరుకుని బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బాలిక కేకలు వేయగా ఆమె నోటిని గట్టిగా నొక్కేశారు. వెంటనే ఆమెను అక్కడ నుంచి ఊరి శివార్లకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి సోదరుడు పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితులను అదుపులోకి తీసుకుని బాలికను ఇంటికి చేర్చారు. వైద్య