Girl gives birth to a baby: పాఠశాల మానేసి ఇంట్లోనే ఉంటున్న ఓ 17 ఏళ్ల బాలిక వివాహం కాకుండానే గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. వారం క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తంజావుర్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది: తంజావుర్కు చెందిన 17 ఏళ్ల బాలిక పాఠశాల మానేసి ఇంట్లోనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైనప్పటికీ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఏప్రిల్ 17న తీవ్రమైన కడుపునొప్పి రావటం వల్ల ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతిగా తేల్చారు. అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. వివాహం కాకుండానే పాపకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్న వైద్యులు.. వెంటనే తంజావుర్ మహిళా పోలీసులకు సమాచారం అందించారు.