డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందున్న లక్ష్యం.. రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించే పరీక్ష పాస్ కావాల్సిందే. అయితే తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఈ విధానంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. గుర్తింపు పొందిన కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నవారు ఆర్టీఓ కార్యాలయాల్లో ఎలాంటి టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
"గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రెయినింగ్ కేంద్రాల్లో.. నాణ్యమైన డ్రైవింగ్ కోర్సులు, శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలు పాస్ అయిన వారు.. ఆర్టీఓ ఆఫీస్లో ఎలాంటి టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు. మోటార్ వాహనాల చట్టం,1988 నియమాలకు అనుగుణంగా ఈ కేంద్రాలు శిక్షణ అందిస్తాయి."
-- కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ