గ్యాంగ్స్టర్లకు, తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్స్టర్ల ఇళ్లల్లో అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఇప్పటికే యాంటీ టెర్రర్ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియాతో పాట గోల్డీ బ్రార్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గ్యాంగ్స్టర్లకు, తీవ్రవాదులకు లింక్... దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
గ్యాంగ్స్టర్లకు, తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్స్టర్ల స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు.
national intelligence agency
అక్టోబర్‌లో నాలుగు రాష్ట్రాలతో పాటు దిల్లీలోని 52 ప్రదేశాలలో ఎన్ఐఏ విస్తృత సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సోదాల్లో ఆసిఫ్ ఖాన్ అనే న్యాయవాదితో పాటు హరియాణాకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఉస్మాన్పుర్లోని గౌతమ్ విహార్‌కు చెందిన న్యాయవాది ఆసిఫ్ ఖాన్ ఇంట్లో జరిపిన సోదాల్లో నాలుగు ఆయుధాలతో పాటు పలు పిస్టోళ్లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. న్యాయవాదికి.. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్లతో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో రుజువయ్యింది.