Gang rape: పట్టపగలు దారిలో అడ్డగించి గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన రాజస్థాన్, ఉదయ్‌పుర్ జిల్లాలోని ఝాఢోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాఘ్పూరా చౌక్ ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగటం గమనార్హం.
ఇదీ జరిగింది..
తమ గ్రామానికి దారి వెంట ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న వివాహితను.. ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే మహిళను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించటం ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు మహిళను రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లగా.. మరో వ్యక్తి బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తేరుకున్న బాధిత మహిళ ఒంటిపై చీర లేకుండానే 500 మీటర్ల దూరంలో ఉన్న బాఘ్పూరా చౌక్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న వాళ్లకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది.