కేరళ.. ఎర్నాకుళంలో దారుణం జరిగింది. ఓ వలస కూలీ సరదా కోసం చేసిన పని మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. కంప్రెసర్ పంప్‌తో ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాల్లోకి గాలి కొట్టడం వల్ల కడుపు ఉబ్బి మరణించాడు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన. అసలేం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అసోంకు చెందిన మింటూ, సిద్ధార్థ్.. పని కోసం కేరళకు వలస వచ్చారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. అయితే సిద్ధార్థ.. మింటూ ప్రైవేట్ భాగాల్లోకి కంప్రెసర్ పంప్‌తో గాలి కొట్టాడు. దీంతో ఒక్కసారిగా మింటూ కడుపు ఉబ్బిపోయింది. వెంటనే మింటూను ఆస్పత్రికి తరలించాడు సిద్ధార్థ్. పరీక్షించిన వైద్యులు అప్పటికే మింటూ మరణించినట్లు ధ్రువీకరించారు. హఠాత్తుగా స్పృహ తప్పి తన స్నేహితుడు మింటూ కింద పడిపోయాడని వైద్యులకు సిద్ధార్థ్ చెప్పాడు. అయితే మింటూ ముఖంపై గాయాలు ఉండడం వల్ల అనుమానించిన వైద్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సిద్ధార్థ్ తమదైన శైలిలో విచారించారు. దీంతో పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని సిద్ధార్థ్ అంగీకరించాడు.
మింటూ.. ప్రైవేట్ పార్ట్‌ల ద్వారా కంప్రెసర్ పంప్‌తో గాలి కొట్టడం వల్ల మరణించాడని పోలీసుల దర్యాప్తులో సిద్ధార్థ్ అంగీకరించాడు. సరదా కోసమే ఇలా చేశానని.. మింటూ మరణిస్తాడని అనుకోలేదని తెలిపాడు. అయితే సిద్ధార్థ్‌పై ఇంతకుముందు ఏవైనా కేసులు ఉన్నాయా? నేర చరిత్ర ఏమైనా ఉందా? అని పోలీసులు అరా తీస్తున్నారు. మృతుడికి, నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. మింటూ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పుట్టిన రోజు నాడే అనంతలోకాలకు..ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో హృదయవిదారక ఘటన జరిగింది. పుట్టిన రోజు నాడే ఓ బాలుడు వేడి కూర ఉన్న పాత్రలో పడి మరణించాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. అసలేం జరిగిందంటే..
కగరోల్ పట్టణానికి చెందిన వినోద్ కుమార్‌కు ఏడాది క్రితం కవలలు జన్మించారు. వారిలో ఓ బాబు, పాప ఉన్నారు. కుమారుడి పేరు వంశ్ అని.. కుమార్తె పేరు వంశిక అని పెట్టారు. అయితే సోమవారం వీరి మొదటి పుట్టిన రోజు. చిన్నారుల బర్త్‌డే వేడుకలను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు వినోద్ కుమార్. ఈ నేపథ్యంలో కుటుంబీకులు, బంధువులను ఆహ్వానించాడు. ఓ వైపు మిఠాయిలు చేసే పనిలో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. వంశ్ ఆడుకుంటూ వెళ్లి.. వేడి కూర ఉన్న పెద్ద పాత్రలో పడిపోయాడు. వంశ్ అరుపులు విన్న కుటుంబీకులు వెంటనే బయటకు తీశారు. అప్పటికే వంశ్కు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. దీంతో వంశ్ మరణించాడు. బర్త్‌డే రోజే చిన్నారి మరణించడం వల్ల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.