తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్తను కోల్పోయిన స్నేహితుడి భార్యకు పెళ్లితో నవోదయం

కొవిడ్​తో దెబ్బతిన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచాడు ఓ ప్రాణమిత్రుడు. భర్తను కోల్పోయి బాధపడుతున్న మిత్రుని భార్యను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్​లో జరిగింది.

Man gives life to friend's wife by marrying her
మిత్రుని భార్యను వివాహం చేసుకున్న లోకేష్​

By

Published : Feb 7, 2022, 2:12 PM IST

Updated : Feb 10, 2022, 4:22 PM IST

కరోనా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొవిడ్ కాటుకు ఆ కుటుంబ పెద్ద కన్నుమూశారు. భర్త లేని బాధతో ఆ ఇల్లాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కట్టుకున్నవాడి మరణంతో జీవితం అంధకారం అయ్యిందని బాధపడుతున్న సమయంలో నేనున్నా అంటూ ఆమె చేయిపట్టుకున్నాడు. ఏడడుగులు నడిచే వరకు ఆ చేయిని వదల్లేదు. ఆయన ఎవరో కాదు. కొవిడ్​తో చనిపోయిన ఆ ఇంటి పెద్దకు ప్రాణ మిత్రుడు.

మిత్రుడు మరణంతోనే ఆ కుటుంబాన్ని వదులుకోక.. ఇంటిపెద్దగా మారి అందరి ఆశీర్వాదంతో స్నేహితుని భార్యను పెళ్లి చేసుకుని అండగా నిలబడ్డాడు.

పెద్దల సమ్మతితో ఒక్కటైన జంట

ఏం జరిగిందంటే..?

కర్ణాటక చామరాజ్​నగర్​లోని ముల్లూర్​ గ్రామానికి చెంది చేతన్ కుమార్​కు, గుల్బర్గా జిల్లాలోని హనూర్​కు చెందిన అంబికకు 8 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. చేతన్ బెంగళూరులోని ఓ ప్రైవేట్​ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే కొవిడ్ రెండో వేవ్​ సమయంలో చేతన్ కరోనా సోకి చనిపోయాడు. దీంతో అతని భార్య అంబిక.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక అత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో చేతన్​ ప్రాణస్నేహితుడైన లోకేశ్ ఆమెను ఓదార్చాడు. ఎలాగైనా అంబికకు అండగా నిలవాలనుకున్నాడు.

వివాహ కార్యక్రమంలో జంట

అనంతరం చేతన్​, అంబిక కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఇరు కుటుంబాల సమ్మతితో ఆమెను జనవరి 27న పెళ్లి చేసుకున్నాడు. చామరాజనగర్​లోని శివయోగి మఠం వీరి వివాహానికి వేదికైంది.

ఇదీ చూడండి:కరోనాతో భర్త మృతి.. మరిదితో మహిళ వివాహం

Last Updated : Feb 10, 2022, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details