తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​లో హిమపాతం- రైతుల్లో ఆందోళన - tourist himachal

హిమాచల్ ​ప్రదేశ్​లో విపరీతంగా మంచు కురవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. హిమపాతం వల్ల తమ పొలాలను పంట వేయడానికి సిద్ధం చేయడం ఆలస్యం అవుతుందని వాపోతున్నారు. చేతికొచ్చిన కూరగాయ పంటలు నాశమవుతున్నాయని చింతిస్తున్నారు.

Framer suffer from heavy snowfall
హిమాచల్​లో హిమపాతం

By

Published : Apr 8, 2021, 5:11 PM IST

Updated : Apr 8, 2021, 6:07 PM IST

హిమాచల్​లో హిమపాతం

హిమాచల్​ప్రదేశ్ లాహౌల్​-స్పిటి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. దీంతో రైతులు, లోయలోని వ్యవసాయ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాహౌల్​ లోయలో రైతులు తమ పొలాలను పంటలు వేయడానికి సిద్ధం చేసుకునే సమయమిది. అయితే హిమపాతం కారణంగా.. అందుకు వీలుపడటం లేదు. పండ్లు, కూరగాయల పంటలు రైతులకు చేతికొచ్చే వేళ.. అవి మంచులో కూరుకుపోయి పాడైపోతున్నాయి.

లోయలో కురుస్తున్న మంచు
పాలీహౌస్​లపై భారీగా కురిసిన మంచు
ఇంటి ముందు మంచును తొలగిస్తున్న స్థానికులు

రహదారులపై మంచు పేరుకుపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లాహౌల్​ వ్యాలీకి ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. జన జీవనం స్తంభించింది.

ఇదీ చూడండి:ఉత్తరాఖండ్​ను కమ్మేసిన మంచు- ప్రజల ఇక్కట్లు

Last Updated : Apr 8, 2021, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details