పిడుగుపాటుకు ఒక్కరోజే 14 మంది బలి.. సీఎం విచారం
11:12 July 21
పిడుగుపాటుకు ఒక్కరోజే 14 మంది బలి.. సీఎం విచారం
Lightning Strikes UP: పిడుగుపాటుకు 14 మంది మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం ఈ ఘటనలు సంభవించాయి. మృతుల్లో బాందా నుంచి నలుగురు, ఫతేపుర్ నుంచి ఇద్దరు, బల్రాంపుర్, ఛందౌలి, బులంద్‌శహర్, రాయ్ బరేలీ, అమేఠీ, కౌశాంబి, సుల్తాన్‌పుర్, చిత్రకూట్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.