నాలుగేళ్ల వయసులో చిన్నారులు చిట్టి పొట్టి మాటలు మాట్లాడుతుంటేనే తల్లితండ్రులు తెగ మురిసిపోతుంటారు. అలాంటిది.. అన్ని కళల్లో ప్రతిభ చూపే నైపుణ్యం సంపాదించే పనిలో పిల్లలుంటే? ఆ తల్లితండ్రుల ఆనందానికి అవధులుండవు కదూ! కర్ణాటకలోని ఓ దంపతులకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. ఇంతకి ఎవరు ఆ చిన్నారి? ఆమె ప్రతిభ ఏంటి?
కాదేదీ ప్రతిభకు అనర్హం..
కర్ణాటక అథని తాలూకులోని బెల్గాంకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శ్రావ్య సదాశివ చిక్కట్టి.. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మ్యాప్ చూస్తు ప్రపంచదేశాల పేర్లను గడగడా చదివేయడం, పెయింటింగ్, పాటలు పాడటం, భరతనాట్యం మొదలైనవి ఈ చిన్నారికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు.