ఆటలాడుతూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుణ్ని క్షేమంగా రక్షించారు అధికారులు. రాజస్థాన్లోని సాంచోర్ ప్రాంతం, లాచ్డి గ్రామంలో బుధవారం(ఈ నెల 5న) ఈ ఘటన జరగ్గా.. సుమారు 20 గంటలపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారిని కాపాడారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది.
బోరుబావిలో పడిన బాలుడి కథ సుఖాంతం - రాజస్థాన్ వార్తలు
రాజస్థాన్లో బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇందుకోసం సుమారు 20 గంటలపాటు శ్రమించారు అధికారులు.
బోరుబావి, చిన్నారి
శుక్రవారం తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. అనంతరం.. బాలుడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యల పర్యవేక్షణలో ఉంచారు.