బిహార్‌లోని ముజఫర్‌పుర్-రేవా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి.. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురిని.. అనితా(4), మనీశా(5), గోలు(5)గా గుర్తించిన అధికారులు.. నాలుగో చిన్నారి ఎవరో గుర్తించే పనిలో ఉన్నారు.
ఘోర ప్రమాదం- నలుగురు చిన్నారులు మృతి - బిహార్లో రోడ్డు ప్రమాదం
ట్రక్కు అదుపుతప్పి ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం బిహార్లో జరిగింది.
ప్రమాదం
గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో పిల్లలు తమ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వారిపైకి ట్రక్కు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కోపోద్రికులైన స్థానికులు.. డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించే ముందు దేహశుద్ధి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఆహారం ఇచ్చేందుకు వెళ్లి.. వైద్యురాలిపై అత్యాచారం!