కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ యోగా చేస్తుండగా గాయపడ్డారు. మంగళూరులోని యెనెపోయ ఆసుపత్రి ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.
ఆదివారం ఉదయం యోగా చేస్తుండగా.. ఆసనంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు ఫెర్నాండెజ్. ఆ సమయంలో భౌతికంగా ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ రోజువారీ చెకప్‌లో భాగంగా ఆసుపత్రికి వెళ్లగా.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఐసీయూకి తరలించి చికిత్స చేస్తున్నారు.