తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిలకడగా మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యం - మన్మోహన్ సింగ్​ ఆరోగ్యం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు (Manmohan Singh Latest News) దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు వెల్లడించారు. జ్వరం, నీరసం కారణంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మన్మోహన్​ సింగ్
మన్మోహన్​ సింగ్​, manmohan singh

By

Published : Oct 13, 2021, 7:01 PM IST

Updated : Oct 14, 2021, 2:00 AM IST

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్​ సింగ్​ (Manmohan Singh Latest News) ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్​ వైద్యులు వెల్లడించారు. మన్మోహన్​కు చికిత్సను కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు.

బుధవారం సాయంత్రం మన్మోహన్​ (Manmohan Singh Latest News) అస్వస్థతకు గురయ్యారు. జ్వరం వచ్చి నీరసంగా ఉన్న ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్​ ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

89 ఏళ్ల మన్మోహన్​ సింగ్​కు కొద్దిరోజుల క్రితం జ్వరం వచ్చింది. సోమవారం తగ్గినా.. ఆయన బాగా నీరసపడిపోయారని, ద్రవాహారం మాత్రమే తీసుకుంటున్నారని తెలిసింది.

ఈ ఏడాది ఏప్రిల్​లో మన్మోహన్​ సింగ్​కు కరోనా సోకగా.. కొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందారు.

ఇదీ చూడండి :'కన్నడ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. యడ్డీ-సిద్ధు రహస్య భేటీ!'

Last Updated : Oct 14, 2021, 2:00 AM IST

ABOUT THE AUTHOR

...view details