భారత్లో కరోనా వ్యాప్తిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎ బోబ్డేకి కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ లేఖ రాశారు. కరోనా ఉద్ధృతిపై సుమోటోగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా విజృంభణపై సీజేఐకి లేఖ
దేశంలో కరోనా విజృంభణపై సుమోటోగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకి లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.
సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా 2 లక్షల కేసులు దాటడాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. ఎన్నికల ర్యాలీలు, ధర్నాలపై నిషేధం విధించాలని కోరారు. అలాగే కొవిడ్ టీకా ఎగుమతులపై నిషేధం విధించాలని.. అన్ని వయసుల వారికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Last Updated : Apr 17, 2021, 7:10 AM IST