తెలంగాణ

telangana

By

Published : Aug 7, 2021, 2:44 PM IST

ETV Bharat / bharat

వరదల ధాటికి కుప్పకూలిన రెండంతస్తుల భవనం

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజస్థాన్​లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దిల్లీ, బిహార్, యూపీల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి.

rain, floods
వర్షాలు, వరదలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. రాజస్థాన్​ బారన్​ ప్రాంతం ముంపునకు గురవ్వగా.. ఉత్తర్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దిల్లీ, బిహార్​లోను భారీగా వర్షపాతం నమోదైంది.

రాజస్థాన్​లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బరాన్​ జిల్లాలో పలు గ్రామాల వీధులు, జనావాసాలు జలమయమయ్యాయి. ఛబ్రా, హడౌతీ, ఖటోలీ, ఇటావా, కోటాలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లతో రంగంలోకి దిగారు సహాయ సిబ్బంది. శుక్రవారం రాత్రి దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరో 150 మందికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

రాజస్థాన్​లో వరద

ఝాలావాడ్​ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది.

కూలిన భవనం

ఉత్తర్​ప్రదేశ్ ప్రయాగ్​రాజ్​లో నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భారీగా కురిసిన వర్షానికి చెరువుల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది.

యూపీలో వీధుల్లోకి చేరిన నీరు

బిహార్​ పట్నాలో గంగానదిలో నీరు ప్రమాదస్థాయిని దాటింది. పట్నాలోని క్రిష్ణా ఘాట్​ వద్ద నీటి మట్టం పెరిగింది. వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు.

దిల్లీలో పలుచోట్ల భారీగా వర్షం కురిసింది. దీంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:భారీ వర్షాలకు 14 మంది బలి

ABOUT THE AUTHOR

...view details