కరోనా మహమ్మారి రూపం మారుస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. తొలిసారి బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈటా వేరియంట్‌ను కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తిలో గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
భారత్‌కు 'ఈటా' వైరస్- దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిలో... - కరోనా కొత్త రకం
కొవిడ్ వైరస్ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ.. విస్తరిస్తోంది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన 'ఈటా వేరియంట్' భారత్‌కు పాకింది. మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
ఈటా వేరియంట్
బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలిందని, కొద్ది రోజుల తర్వాత అతను కోలుకున్నట్లు చెప్పారు. అతనితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
వైరస్ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా.. ఆ వ్యక్తిలో కొత్త రకం బయటపడినట్లు చెప్పారు.