తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారుల వార్డులో మంటలు- ఎనిమిదికి చేరిన మృతులు

భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతుల తల్లిదండ్రులకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

Bhopal children's hospital
భోపాల్

By

Published : Nov 9, 2021, 7:27 PM IST

మధ్యప్రదేశ్​ భోపాల్‌లోని ప్రభుత్వ కమలా నెహ్రూ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. అగ్నిప్రమాదంలో పిల్లలు మరణించడం అత్యంత బాధాకరమని ట్వీట్ చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మృతుల తల్లిదండ్రులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించారు.

"చిన్నారుల మరణం అత్యంత బాధ కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా."

-శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్​ సీఎం

సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రి భవనంలోని మూడో అంతస్థులోని పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. దీనితో ఆసుపత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. తమ పిల్లల కోసం వెతుకుతూ తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details