తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థిపై ఐఏఎస్​ అధికారి లైంగిక వేధింపులు! - ఝార్ఖండ్​ న్యూస్

ఝార్ఖండ్​ ఖుంటి జిల్లాలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఐఏఎస్​ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం.. 14 రోజుల కస్టడీ విధించింది.

molesting IIT student
molesting IIT student

By

Published : Jul 5, 2022, 8:51 PM IST

Updated : Jul 5, 2022, 9:14 PM IST

Molesting IIT Student: విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఐఏఎస్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని ఖుంటి జిల్లాలో జరిగింది. ట్రైనింగ్​కు వచ్చిన విద్యార్థిపై 2019 బ్యాచ్​కు చెందిన సబ్ ​డివిజనల్​ మేజిస్ట్రేట్​ రియాజ్​ అహ్మద్​ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఫిర్యాదు చేయడం వల్ల ఆయనపై ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ​అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. నిందితుడికి 14 రోజుల కస్టడీని విధించింది.

ఐఏఎస్​ అధికారి రియాజ్​ అహ్మద్​

బాధితురాలు సహా ఎనిమిది మంది ఐఐటీ విద్యార్థులు ట్రైనింగ్​ కోసం ఖుంటి జిల్లాకు వచ్చారు. డిప్యూటీ డెవలప్​మెంట్​ కమిషనర్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. వచ్చిన అతిథులు, విద్యార్థులు మద్యం సేవించినట్లు తెలిసింది. ​ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న బాధితురాలిని అధికారి లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. అధికారి లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమేనని తేల్చారు.

ఇదీ చదవండి:స్పైస్​జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! ఒకే రోజులో రెండు..17 రోజుల్లో ఏడు

Last Updated : Jul 5, 2022, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details