దిల్లీలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో వలస కూలీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోసారి లాక్డౌన్ ఎక్కడ విధిస్తారో అనే భయంతో అందరూ సొంతూళ్ల బాట పట్టారు.
'ప్రస్తుతం దిల్లీలోని పరిస్థితులను చూస్తే లాక్డౌన్ అమలు చేస్తారని అనిపిస్తోంది. మాకు వేరే గత్యంతరం లేదు' అని వలస కూలీలు అంటున్నారు.