తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమార్తెపై తండ్రి అత్యాచారం, బిడ్డకు జన్మనిచ్చిన బాలిక, బెయిల్​పై వచ్చి మరోసారి రేప్​ - జలంధర్​ రేప్​ కేసు

కుమార్తెపై కన్న తండ్రే అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణం పంజాబ్​లో జరిగింది. మధ్యప్రదేశ్​లో అత్యాచార కేసులో అరెస్టైన వ్యక్తి.. బెయిల్​పై వచ్చి మరోసారి అదే బాలికను రేప్ చేశాడు.

girl rape
బాలికపై అత్యాచారం

By

Published : Aug 30, 2022, 12:12 PM IST

పంజాబ్​లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. కన్న తండ్రే తన మైనర్​ కూతురిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. తన పాపాన్ని కడిగేసుకోవాలని నిందితుడు ఆ శిశువును కాలువలో విసిరేస్తుండగా గ్రామస్థులు గమనించి.. అతడ్ని అడ్డుకున్నారు. చిన్నారిని అతడి వద్ద నుంచి లాగేసుకొన్నారు. ఈ విషయంపై బాలికను ప్రశ్నించగా విస్తుపోయే నిజాన్ని చెప్పింది.

పోలీసుల వివరాల ప్రకారం..
జలంధర్‌లోని లెదర్ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల ఓ బాలికపై ఆమె తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత కొంత కాలంగా తండ్రే తనపై అత్యాచారం చేస్తున్నట్లు బాలిక వెల్లడించింది. "గత కొంత కాలంగా మా తండ్రి నాపై అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మా అమ్మని, నన్నూ ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు" అని బాలిక తెలిపింది. మరోవైపు బాలిక తల్లి కూడా మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా నా భర్త డ్రగ్స్​కి బానిస అయ్యాడు. నా కూమారై జీవితాన్ని నాశనం చేశాడు. నా భర్తను కఠినంగా శిక్షించండి' అని ఆమె కోరింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించి.. బాలికను, ఆమెకు పుట్టిన శిశువును ఆసుపత్రికి తరలించారు. అయితే, శిశువు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. జలంధర్ సివిల్ హాస్పిటల్‌కు వెళ్లారు. అప్పటికే గ్రామస్థులు భారీగా ఆసుపత్రికి తరలి వచ్చారు. నిందితుడ్ని గ్రామస్థులు కొడతారేమోనన్న అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని జలంధర్ పోలీస్ స్టేషన్​కు తరలించినట్లు స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ కమల్​జిత్​ తెలిపారు. బాలిక వాంగ్మూలం తీసుకున్నాక నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్టేషన్​ హౌస్​ ఆఫీసర్ తెలిపారు.

జైలు నుంచి వచ్చి బాలికపై రేప్
ఇది ఇలా ఉండగా మధ్యప్రదేశ్​లో మరో ఘోరమైన ఘటన జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన 26ఏళ్ల వ్యక్తి.. బెయిల్​పై విడుదలై మరోసారి ఆమెపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ వివేక్​ లాల్​ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం..
రీవా జిల్లాలోని ఖాత్​ఖరీ ప్రాంతానికి చెందిన.. 26 ఏళ్ల నిందితుడు గత సంవత్సరం బాలికపై అత్యాచారం చేసినందుకు సెప్టెంబర్​ 23న అరెస్ట్ అయ్యాడు. నిందితుడు కొద్దిరోజుల క్రితం బెయిల్​పై బయటకు వచ్చి మళ్లీ అదే బాలికపై అత్యాచారం చేశాడు. గత శుక్రవారం ఇంటి పనిమీద బయటకు వెళ్లిన బాలికను నిందితుడు అపహరించి.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకుపోయి బెదిరించి మరీ అత్యాచారం జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి : బలవంతంగా బీఫ్ తినిపించిన భార్య, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details