నూతన సాగు చట్టాలపై నిరసనలు కొనసాగుతాయని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయూ) స్పష్టం చేసింది. తమ వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత సింఘు, టిక్రీ సరిహద్దు ప్రాంతాలకు రైతులు తిరిగి చేరుకుంటారని పేర్కొంది. సోమవారం.. రైతులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతాలకు చేరుకున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.
"సోమవారం.. సింఘు, టిక్రీ సరిహద్దుల్లోని నిరసన ప్రదేశాలకు పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారు. ఆందోళనకు మద్దతుగా పంజాబ్ నుంచి వచ్చిన రైతులను స్వాగతించాం. ట్రాక్టర్లు, కార్లు సహా ఇతర వాహనాల్లో వచ్చినవారి కోసం గుడారాలు ఏర్పాటు చేశాం. ఆందోళనలు మరింత ఉద్ధృతంగా కొసాగిస్తాం. "అని ఎస్కేయూ పేర్కొంది.