సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దు వద్ద దారుణ హత్య(singhu border killing news) జరగడం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై భాజపా తీవ్రంగా స్పందించింది. రైతుల నిరసనలు(singhu border farmers protest) నేరస్థుల చేతుల్లోకి వెళ్లాయని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, పంజాబ్ ఇన్ఛార్జ్ దుశ్యంత్ కుమార్ గౌతమ్ విమర్శించారు. వారి కార్యకలాపాలు తాలిబన్లలా ఉన్నాయనేందుకు నిరసన ప్రాంతాల్లో తరచూ జరగుతున్న హింసాత్మక ఘటనలే(singhu border dead body) నిదర్శమని ఆరోపించారు.
" రైతుల ఆందోళన కొందరు నేరస్థుల చేతుల్లోకి వెళ్లింది. గతంలో ఓ యువతిని సరిహద్దులో రేప్ చేసి హత్య చేశారు. రైతుల ఆందోళనల ప్రాంతాల్లో నేరాలు పెరగడం చూస్తే వారు తాలిబన్లలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది"
-దుశ్యంత్ కుమార్ గౌతమ్.
సింఘు ఘటనపై కాంగ్రెస్ స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడ్డారు దుశ్యంత్ కుమార్. లఖీంపుర్ ఖేరి ఘటన జరిగినప్పుడు యూపీ ప్రభుత్వంపై విమర్శలదాడికి దిగిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు(singhu border killing) ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరిగితే మాత్రం ఆ పార్టీ నేతలు మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు.
హింసకు చోటు లేదు: టికాయిత్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంలో(farmers protest news ) హింసకు చోటు లేదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. నిందితులను చట్టప్రకారం శిక్షించాలన్నారు. 11 నెలలుగా తాము దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన చేస్తున్నామని.. ఈ ఘటనతో(singhu border killing news) తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు.
దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతం సింఘులో కాళ్లు,చేతులు వేరు చేసి ఉన్న ఓ 35 వేళ్ల వ్యక్తి మృతదేహం(singhu border man killed) బారికేడ్‌కు వేళాడుతూ కన్పించడం శుక్రవారం కలకలం రేపింది. మృతుడిని పంజాబ్‌లో దళితవర్గానికి చెందిన కూలీ లఖ్బీర్గా సింగ్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని తానే చంపానని సరబ్‌జిత్ సింగ్ అలియాస్ నిహాంగ్ సిఖ్‌గా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసినందుకే లఖ్బీర్ను చంపినట్లు నిహాంగ్ గ్రూప్ వెల్లడించింది. ఈ ఘటనకు(singhu border lynching ) పాల్పడింది తామే అని ప్రకటించింది.
'అలాంటివాడు కాదు'
లఖ్బీర్ను ఎవరో పథకం ప్రకారమే సింఘు సరిహద్దుకు తీసుకెళ్లారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. పని ఉందని చెప్పి రూ.50 తీస్కోని వెళ్లాడని, వారం రోజుల్లో తిరిగొస్తానని చెప్పాడని పేర్కొన్నారు. అతని మృతిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిక్కుల గ్రంథాన్ని అపవిత్రం చేసే మనస్తత్వం అతనికి కాదని చెప్పారు.
తరన్ తారన్ జిల్లా చీమా కాలన్లోని నివాసముండే లఖ్బీర్.. భార్యతో ఐదేళ్ల క్రితమే విడిపోయాడని పోలీసులు చెప్పారు. అతనికి ముగ్గురు పిల్లలు అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రైలులో బాంబు పేలుడు.. సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు