దిల్లీ సరిహద్దులో రైతుల నిరసన ఉద్ధృతంగా సాగుతోంది. ప్రభుత్వం దిగి వచ్చి సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దీర్ఘకాలం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు ఇప్పటికే తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా సర్వం సిద్ధం చేస్తున్నారు అన్నదాతలు. వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాక్టర్ ట్రాలీల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వేళలో దోమలు రాకుండా ఉండేందుకు ట్రాలీ చుట్టూ తెరలు కడుతున్నారు. ఫ్యాన్లు, వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు టిక్రి సరిహద్దులో నిరనన చేస్తోన్న రైతులు ఆ ప్రాంతంలో నీరు కోసం బోరును తవ్వారు. ఫ్యాన్లు సహా సకల సౌకర్యాలను సిద్ధం చేసుకున్నారు.