తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులు రహదారులను నిర్బంధించడం సరికాదు' - delhi border farmers

దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు అక్కడి నుంచి వెళ్లేలా చేయాలని దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొన్న న్యాయస్థానం.. (Farmers protest Supreme Court) రహదారులను నిరవధికంగా నిర్బంధించకూడదని వ్యాఖ్యానించింది.

SUPREME COURT farmers agitation
రైతులు నిరంతరం రోడ్లు నిర్బంధించడం సరికాదు

By

Published : Oct 21, 2021, 12:50 PM IST

Updated : Oct 21, 2021, 1:04 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమంపై సుప్రీంకోర్టు (Farmers protest Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ నిరవధికంగా రోడ్లను నిర్బంధించకూడదని స్పష్టం చేసింది. నిరసన తెలిపే హక్కుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్న న్యాయస్థానం.. కోర్టులో సమస్య పెండింగ్​లో ఉన్నప్పటికీ, రహదారులను (Farmers protest Delhi) నిర్బంధించడం సరికాదని వ్యాఖ్యానించింది.

"రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది. రోడ్లపై ఏ రూపంలోనైనా నిరసన చేయవచ్చు. కానీ, ఇలా నిరవధికంగా రహదారులను నిర్బంధించకూడదు. రోడ్లపై వెళ్లే హక్కు ప్రజలకూ ఉంటుంది."

-సుప్రీంకోర్టు

దిల్లీ సరిహద్దు నుంచి నిరసనకారులను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ (Farmers protest Supreme Court hearing) చేపట్టిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందించాలని రైతు సంఘాలకు మూడు వారాల సమయమిచ్చింది. (Farmers protest India) అనంతరం విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది.

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Oct 21, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details