కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. సింఘు సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొన్న చౌదరి సింగ్ (57) తీవ్రమైన చలికి తట్టుకోలేక మృతి చెందినట్లు రైతు సంఘాలు తెలిపాయి.
దిల్లీ ఆందోళనల్లో మరో రైతు మృతి
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాకు చెందిన చౌదరి సింగ్ (57) చలికి తట్టుకోలేక చనిపోయినట్లు రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
దిల్లీ ఆందోళనల్లో మరో రైతు మృతి
ప్రాణాలు కోల్పోయిన రైతు.. ఉత్తర్‌ప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని నంగల్ భావన్‌పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి అని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ఇంఛార్జి శంషేర్ రాణా వెల్లడించారు.