పంజాబ్ అమృత్‌సర్‌లో ఓ వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు, ట్రాన్స్‌జెండర్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. అందుకోసం ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని.. ఓ పాపను కూడా దత్తత తీసుకుని ఆనందంగా గడుపుతున్నారు.
ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు.. చిన్నారిని దత్తత తీసుకుని ఆనందంగా.. అంతలోనే.. - పంజాబ్‌లో ట్రాన్స్‌జెండర్ పెళ్లి న్యూస్
ఓ ట్రాన్స్‌జెండర్.. యువకుడిని ప్రేమించింది. ఇందుకోసం ఆపరేషన్ చేయించుకుని మరీ అమ్మాయిగా మారింది. అనంతరం పెళ్లి చేసుకుని ఓ పాపను కూడా దత్తత తీసుకుంది ఈ జంట. అయితే ఆనందంగా గడుపుతున్న తమ జీవితంలోకి బంధువులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని యువకుడు ఆరోపిస్తున్నాడు. అసలేం జరిగిందంటే?..
ఇదీ జరిగింది
అర్జున్ అనే యువకుడు రవి అనే ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ కలసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రవి ఆపరేషన్ చేసుకుని మరీ అమ్మాయిగా మారాడు. అనంతరం తన పేరును మీన్ రియాగా మార్చుకున్నాడు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరు ఒక పాపను కూడా దత్తత తీసుకున్నారు. అయితే ఆనందంగా గడుపుతున్న సమయంలో.. రియా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆమె బంధువులు కొంతమంది వారి బంధానికి వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. భోగీ రోజున కూడా వారు వచ్చి తనను అసభ్యంగా తిట్టడమే కాకుండా కొట్టారని అర్జున్ ఆరోపించాడు. ఈ వేధింపులు ఆపకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అతడు తెలిపాడు.
"రియా నాకోసం అమ్మాయిగా మారింది. మేమిద్దరం ఒక పాపను దత్తత తీసుకుని హాయిగా జీవిస్తున్నాం. అయితే మా మధ్యకు రియా కుటుంబ సభ్యురాలు వచ్చి కలహాలు సృష్టిస్తోంది. తన వల్ల మేము 11 నెలలు పోలీసు కస్టడీలో ఉన్నాం. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత రాజీపడి కలిసి జీవిస్తున్నాం. రియా బంధువులు కూడా కొంతమంది మా బంధాన్ని వ్యతిరేకించి నన్ను అసభ్యంగా తిట్టడమే కాకుండా కొట్టారు. ఇలా మమ్మల్ని వేధించడం ఆపకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం."
- బాధితుడు అర్జున్