కర్ణాటక చామరాజనగర్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. మొక్కు తీర్చుకునేందుకు ఓ దంపతులు కెనడా నుంచి వచ్చి.. మలే మహదేశ్వర్ కొండపై ఉన్న సాలూరు మఠానికి దూడను దానం ఇచ్చారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ దేవాలయంగా పేరొందింది.
ఆవును దానం చేసేందుకు కెనడా నుంచి కర్ణాటకకు.. కోరిక నెరవేరినందుకే.. - కెనడా నుంచి వచ్చి ఆవును దానం చేసిన భక్తులు
కెనడా నుంచి మాదప్ప కొండకు మొక్కు తీర్చుకునేందుకు వచ్చారు దంపతులు. మహాదేశ్వర్ ఆలయానికి దూడను దానం చేశారు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.
కెనడా నుంచి కర్ణాటక వచ్చి ఆవును విరాళంగా ఇచ్చిన భక్తులు
బెంగళూరుకు చెందిన వెంకటేష్, లక్ష్మి దంపతులు ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. అయితే ఈ భక్తులు కోరుకున్న కోరిక నెరవేరితే మాదప్ప కొండకు వచ్చి దూడను విరాళంగా ఇస్తామని మొక్కుకున్నారు. వారి కోరిక నెరవేడం వల్ల అనుకున్నట్లుగానే కెనడా నుంచి మలే మహదేశ్వర్ ఆలయానికి వచ్చి గోమాతను దానం ఇచ్చారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.