తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2021, 1:50 PM IST

Updated : Dec 11, 2021, 1:56 PM IST

ETV Bharat / bharat

Pinaka Rocket: పినాక రాకెట్​ లాంచర్​ విస్తరణ ప్రయోగం విజయవంతం

Pinaka rocket system: పినాక రాకెట్​ లాంచర్​ విస్తరణ శ్రేణి వ్యవస్థ వివిధ దశ ప్రయోగాలు విజయవంతమైనట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్​డీఓ పేర్కొంది. గత మూడు రోజులుగా రాజస్థాన్​లో పోఖ్రాన్​లో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు తెలిపింది.

pinaka rocket system
పినాక రాకెట్​ లాంచర్​ విస్తరణ ప్రయోగం విజయవంతం

పినాక రాకెట్​ లాంచర్​ విస్తరణ ప్రయోగం విజయవంతం

Pinaka rocket system: భారత సైన్యం దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్‌ లాంచర్‌ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. ఈ లాంచర్‌ విస్తరణ శ్రేణికి చెందిన పినాక-ఈఆర్​ మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థ వివిధ దశ ప్రయోగాలు విజయవంతం అయ్యాయి.

రాజస్ధాన్‌లోని పోఖ్రాన్‌లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ), సైన్యం ఈ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశాయి. ప్రయోగాల్లో భాగంగా గత మూడు రోజులుగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్ని ప్రయోగాల ఉద్దేశాలు సంతృప్తికరంగా నెరవేరినట్లు వివరించింది.

పినాక-ఈఆర్​ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థ సాంకేతికతను డీఆర్​డీఓకు చెందిన ఆయుధ పరిశోధన, అభివృద్ధి సంస్థ సహా హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ లాబొరెటరీ.. అభివృద్ధి చేశాయి. డీఆర్​డీఓ నుంచి ఈ సాంకేతికతను పొందిన ఓ ప్రైవేటు కంపెనీ.. రాకెట్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కొత్తగా ఉద్భవిస్తున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించినట్లు డీఆర్​డీఓ తెలిపింది. భాగస్వామ్య ప్రైవేటు కంపెనీ.. సాంకేతికతను అవగతం చేసుకోవడంలో ప్రాథమికంగా విజయవంతం కావడం.. పినాక-ఈఆర్​ రాకెట్‌ వ్యవస్థ తయారీకి ఆ కంపెనీని సిద్ధం చేసినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:Brahmos Missile: బ్రహ్మోస్ 'ఎయిర్​ వెర్షన్' ప్రయోగం సక్సెస్

Last Updated : Dec 11, 2021, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details