బ్రెగ్జిట్‌లో భాగంగా.. అనుకున్న గడువు కన్నా కొద్ది రోజుల ముందే.. ఐరోపా సమాఖ్యతో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది బ్రిటన్. ఇందుకోసం ఇరు దేశాలు చాలా కష్టపడ్డాయి. మరి ఇంతటి చరిత్రాత్మక ఒప్పందం వల్ల భారత్‌కు ఏదైనా లాభం ఉంటుందా? బ్రిటన్, ఈయూలతో భారత్ సంబంధాలు మారుతాయా? వంటి ప్రశ్నలపై.. ప్రముఖ ఆర్థికవేత్త ఆకాశ్ జిందాల్ 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో స్పందించారు.
ఐరోపా సమాఖ్య, బ్రిటన్ మధ్య జరిగిన బ్రెగ్జిట్ ఒప్పందంతో భారత్‌కు మేలు జరుగుతుందా?
బ్రెగ్జిట్ ఒప్పందం కోసం బ్రిటన్ సుమారు 18 నెలలు తర్జభర్జన పడింది. అయితే అదే సమయంలో భారత్‌కు ఆ దేశం దగ్గరైంది. అయితే ఈ ఒప్పందంతో భారత్‌కు మేలు జరగనుంది. ప్రతీ దేశం అంతర్జాతీయంగా వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అది దేశాభివృద్ధికి అవసరం. గ్లోబలైజేషన్‌తో ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతోన్న భారత్ లాంటి దేశాలు పెట్టుబడులకు చాలా అనుకూలమైనవి. రాబోయే రోజుల్లో పరస్పర ఆర్థిక సంబంధాల విషయంలో సహకారం, స్థిరమైన వృద్ధిని బ్రిటన్ నుంచి మేము ఆశిస్తున్నాము. ఇందుకు తగ్గట్టుగా బ్రిటన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను మేము చూశాం. భారతీయులకు పౌరసత్వం విషయంలో నిబంధనలు సడలిస్తున్నారు. ఈ కారణంగా భారత్ నుంచి చాలా మంది బ్రిటన్‌కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బ్రిటన్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇందులో భారత్ 5వ స్థానంలో ఉంది. జపాన్, చైనాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉన్నాయి. మూడేళ్లలో జపాన్ జీడీపీకి స్థిరమైన వృద్ధి కొరవడింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు బలమైన దేశం కావాలి. అది భారత్‌యే. బ్రిటన్‌తో బలమైన సంబంధాలకు భారత్ చిరునామాగా నిలువనుంది.
బ్రెగ్జిట్ ఒప్పందంతో భారత్‌కు లాభించే విషయం ఏంటీ?
ఈ వాణిజ్య ఒప్పందంతో సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. బ్రిటన్‌లో మ్యూచువల్, పెన్షన్ ఫండ్స్ ఎక్కువ. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ గల చాలా దేశాల్లో మార్కెట్లల్లో పెట్టుబడి పెడితే వచ్చే లాభం కంటే అభివృద్ధి చెందుతోన్న భారత్ లాంటి దేశాల్లో పెట్టుబడి పెట్టి రెట్టింపు లాభాలు ఆర్జించడానికి ఆవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని ఆశించవచ్చు.