తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైద్యులకు కరోనా డ్యూటీ 8 గంటలకు మించొద్దు'

Covid duty of resident doctors: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వేకంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్యుల రక్షణపై కీలక సూచనలు చేసింది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్(ఐఎంఏ). రెసిడెంట్​ డాక్టర్లకు కొవిడ్​ డ్యూటీ 8 గంటలకు మించకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

Indian Medical Association
ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​

By

Published : Jan 6, 2022, 7:36 AM IST

Covid duty of resident doctors: కరోనా బాధితులకు చికిత్స అందించే రెసిడెంట్​ వైద్యుల డ్యూటీ సమయం 8గంటలకు మించకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్(ఐఎంఏ). వారం రోజులు విధులు నిర్వర్తించిన తర్వాత 10-14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచాలని తెలిపింది. అందుకు వారు పని చేసే ఆసుపత్రులే వసతులు కల్పించాలని పేర్కొంది.

కొవిడ్​ విధులు నిర్వర్తిస్తూ.. వైద్యులు అనారోగ్యానికి గురైతే వీలైనంత త్వరగా చికిత్స అందించాలని పేర్కొంది ఐఎంఏ. ఎవరైనా అనుకోకుండా మరణిస్తే.. వారి మరణ ధ్రువీకరణ, పరిహారం వంటివి త్వరగా అందించాలని తెలిపింది.

"కొవిడ్​ రెండో దశలో సుమారు 2వేల మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ ప్రజల్లో మరణాల రేటు 1.5 శాతం ఉంటే.. ఆరోగ్య సిబ్బందిలో 2-3 శాతం మేర ఉంది. ఈ డేటా ప్రకారం ఇప్పటికే 1,00,000 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. కరోనా మూడోవేవ్​లో మరణాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నాం. కానీ, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్​ 5.4 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. కొవిడ్​ వార్డుల్లో పనిచేసే వైద్యులకే ముప్పు ఎక్కువ. సాధారణ ప్రజలతో పోలిస్తే.. 5-10 రెట్లు వైద్యులు కరోనా బారినపడే అవకాశం ఉంది. దేశంలోని అతిపెద్ద వైద్య కళాశాలలు, ఆసుపత్రులను తీసుకున్నా పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది, ముఖ్యంగా డాక్టర్లు కరోనా బారినపడ్డారు. రెసిడెంట్​ డాక్టర్ల కరోనా డ్యూటీ 8గంటలకు మించి ఉండకూడదు. ఏడు రోజులు విధులు నిర్వర్తించిన తర్వాత ఆసుపత్రి సూచించిన వసతిలో 10-14 రోజులు క్వారంటైన్​లోకి పంపాలి. "

- ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్

వైద్యుల కొరతతో ఆరోగ్య విభాగం ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అలాంటి సమస్య తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది ఐఎంఏ. వైద్య కళాశాలల సమన్వయంతో కొవిడ్​ కట్టడి చేపట్టాలని తెలిపింది.

ఇదీ చూడండి:వైద్యులపై కరోనా పంజా.. బిహార్​లో మరో 59మందికి పాజిటివ్​

వైద్యులపై కరోనా పడగ.. 193 మందికి పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details