తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Encounter in UP : ఉత్తర్​ప్రదేశ్​లో మరో ఎన్​కౌంటర్​.. మహిళా పోలీసుపై దాడి చేసిన నిందితుడు హతం - again encounter in uttar pradesh

Encounter in UP : ఉత్తరప్రదేశ్​లో ఓ మహిళా కానిస్టేబుల్​పై తీవ్రంగా దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులకు గాయాలయ్యాయి.

encounter in UP
Encounter in UP

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 8:01 PM IST

Updated : Sep 22, 2023, 8:50 PM IST

Encounter in UP :రైలులో ఓ మహిళా కానిస్టేబుల్​ను తీవ్రంగా గాయపరిచిన ఓ నిందితుడు ఎన్​కౌంటర్​లో హతం అయ్యాడు. కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు కూడా గాయపడ్డారని యూపీ పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరయూ ఎక్స్​ప్రెస్ రైలులో ఓ మహిళా కానిస్టేబుల్​పై ఆగస్టు 30న దాడి జరిగింది. సీటు విషయంలో ఆమెతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అది కాస్త ఘర్షణగా మారింది. నిందితుడు తన స్నేహితుడితో కలిసి ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. రైలు అయోధ్య స్టేషన్​ రాగానే వారంతా రైలుదిగి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రైలులో రక్తపు మడుగులో స్పృహకోల్పోయి ఉన్న మహిళా కానిస్టేబుల్​ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వాట్సప్‌లో వైరల్‌ అయిన వార్తలను సుమోటోగా స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు.. యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించింది.

పోలీసు అధికారికి తూటా దెబ్బ..
న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధాన నిందితుడిని అనీశ్ ఖాన్​గా గుర్తించారు. అతడిని పట్టుకోవడానికి అయోధ్యలో పోలీసులు సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే పోలీసులను చూసిన అనీశ్, అతడి స్నేహితులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎన్​కౌంటర్ జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో గాయపడ్డ అనీశ్.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్​లో మరో ఇద్దరు నిందితులతో సహా ఓ పోలీసుకు తూటా గాయాలయ్యాయని వారు తెలిపారు.

ఎన్​కౌంటర్​లో వాంటెడ్​ క్రిమినల్‌ హతం!
Gufran Encounter : ఈ ఏడాది జూన్​ ఆఖరి వారంలో ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఓ ఎన్​కౌంటర్​లో మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్‌ గుఫ్రాన్‌ మరణించాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతడు హతమయ్యాడు. కాగా, ఆజాద్​నగర్​కు చెందిన గుఫ్రాన్‌ 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన కౌశాంబీ జిల్లాలోని మంఝన్​పుర్​ సమీపంలోని షుగర్​ మిల్లు వద్ద జూన్​ 27(మంగళవారం) తెల్లవారుజామును 5 గంటల ప్రాంతంలో జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Gufran Encounter : యూపీలో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. వాంటెడ్​ క్రిమినల్‌ హతం

కారు ఆపిన పోలీసులపై బాంబు దాడి.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతి

Last Updated : Sep 22, 2023, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details