Jammu Kashmir encounter: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీసు అమరుడయ్యారు. చనిపోయిన ముష్కరులు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు పోలీసులు తెలిపారు.
"జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులను మట్టుబెట్టాం. వారు గత నాలుగు నెలలుగా చురుకుగా ఉన్నారు. వారి కదలికలపై ఇప్పటివరకు నిఘా పెట్టాం. ఈ ఎన్కౌంటర్లో ఒక పోలీసు వీరమరణం పొందారు."