Employment News December 2023 : ఈ డిసెంబర్ నెలలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయా నోటిఫికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bank Of Baroda Senior Manager Recruitment 2023 :బ్యాంక్ ఆఫ్ బరోడా 250 సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- విద్యార్హతలు : డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎంబీఏ (మార్కెటింగ్ & ఫైనాన్స్) చేసిన వారు కూడా ఈ పోస్టులకు అర్హులే.
- వయోపరిమతి : అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు నుంచి 37 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఎంపిక విధానం : అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత సైకోమెట్రీ టెస్ట్ కూడా చేస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి.. అందులో క్వాలిఫై అయిన వారిని సీనియర్ మేనేజర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను వీక్షించండి.
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 26
IB ACIO Recruitment 2023 :మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఉద్యోగాల వివరాలు :అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ - గ్రేడ్ II ఎగ్జిక్యూటివ్ పోస్టులు - 995
- విద్యార్హతలు : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్ 15 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు :అభ్యర్థులు అందరూ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.450 చెల్లించాలి. దీనికి తోడు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు) అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మాత్రం అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
- ఎంపిక ప్రక్రియ : అభ్యర్థులకు ముందుగా టైర్-1, టైర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
- జీతభత్యాలు : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందిస్తారు.
- దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2023 డిసెంబర్ 15