తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ భారీగా బంగారం, నగదు పట్టివేత

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు బయటపడింది. చెన్నై రైల్వేస్టేషన్​లో ఎనిమిది కిలోల పసిడిని రైల్వేశాఖ స్వాధీనం చేసుకుంది. శ్రీరంగం రోడ్డు మార్గంలో చేపట్టిన తనిఖీల్లో.. సరైన లెక్కలు చూపని కారణంగా సుమారు రూ. కోటి నగదు పట్టుబడింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Eight Kgs Gold and around Rs. 1crore cash seized by Election Commission in Tamilnadu
ఎన్నికల వేళ 8 కిలోల బంగారం, రూ.కోటి నగదు పట్టివేత

By

Published : Mar 25, 2021, 5:48 AM IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భారీ ఎత్తున బంగారం బయటపడింది. చెన్నై రైల్వే స్టేషన్​లో అక్రమంగా తరలిస్తున్న 8 కిలోల పసిడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన బంగారం

కోయంబత్తూర్​ నుంచి చెన్నై సెంట్రల్​ రైల్వే స్టేషన్​కు చేరుకున్న రైల్లో తనిఖీలు చేపట్టింది రైల్వే భద్రతా సిబ్బంది. ఈ క్రమంలో దిలీప్​ కుమార్​ అనే ప్రయాణికుడి బ్యాగ్​లో 8 కిలోల బంగారాన్ని గుర్తించింది. దిలీప్​ను విచారించగా.. సరైన పత్రాలు చూపలేదు. ఆ పుత్తడిని స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు అప్పగించింది.

ఇదీ చదవండి:తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ!

రూ.కోటి నగదు స్వాధీనం

ఆ రాష్ట్రంలోనే మరోచోట సుమారు కోటి రూపాయల నగదు పట్టుబడింది. శ్రీరంగం-పేట్టవైతలై రహదారి మార్గంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఈ సొమ్మును.. ఎన్నికల కమిషన్​ స్వాధీనం చేసుకుంది.

నగదు స్వాధీనం చేసుకున్న ఆ వాహనంపై ఓ రాజకీయ పార్టీకి చెందిన జెండా, ఓ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి చెందిన స్టిక్కర్​ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఆ సమయంలో అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలిపిన పోలీసులు.. సంబంధిత సొమ్ముకు వారు ఎలాంటి ఆధారాలూ చూపలేదని చెప్పారు. ఈ కేసును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తున్నట్టు వివరించారు.

స్వాధీనం చేసుకున్న సుమారు రూ.కోటి నగదు
నగదు పట్టుబడిన వాహనం

ఇదీ చదవండి:కొవిడ్‌ నీడలో.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం!

ABOUT THE AUTHOR

...view details