తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోంజీ కుంభకోణం కేసులో రూ.155 కోట్లు స్వాధీనం - రోజ్​ వ్యాలీ వార్తలు

బంగాల్​కు చెందిన బాసిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రోజ్ వ్యాలీ గ్రూప్​లపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేపట్టింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. ఈ రెండు కంపెనీలు సుమారు రూ.155 కోట్ల మేర ప్రజల నుంచి వసూలు చేసి మనీలాండరింగ్​కు పాల్పడినట్లు తెలిపింది.

ED takes possession of over Rs 155-cr assets in 2 ponzi cases probe
పోంజీ కుంభకోణం కేసులో రూ.155 కోట్లు స్వాధీనం

By

Published : Apr 21, 2021, 6:48 AM IST

బంగాల్​కు చెందిన రోజ్​ వ్యాలీ గ్రూప్​, వారి ప్రమోటర్లతో సహా మరో రెండు కంపెనీలు రూ.155 కోట్ల మనీలాండరింగ్​కు పాల్పడినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ తెలిపింది. ఈ గ్రూప్​లు పోంజీ విధానం ద్వారా ఈ మోసానికి పాల్పడినట్లు పేర్కొంది. బాసిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రోజ్ వ్యాలీ గ్రూపులపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

బాసిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రోజ్ వ్యాలీ గ్రూప్​లపై మనీలాండరింగ్ కింద కేసు దర్యాప్తు చేపట్టాము. ఈ కంపెనీలు వివిధ నకిలీ పథకాలతో ప్రజలను మోసం చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాయని ఆరోపణలు ఉన్నాయి. వారు తిరిగి చెల్లించమంటే చేతులెత్తేశారని తేలింది.

- ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​

ఈ గ్రూప్​ల వారు ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన నిధులను దారి మళ్లించారని దర్యాప్తులో తేలింది. త్రిపుర, అసోం,బంగాల్​, ఒడిశా, ఉత్తర్​ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వివిధ కంపెనీల పేరిట అనేక ఆస్తులను బాసిల్ గ్రూప్, రోజ్ వ్యాలీ గ్రూప్ కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:పోంజీ స్కాం: రోజ్​ వ్యాలీ ఛైర్మన్ భార్య అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details