ED Raid on Patankar: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రైడ్ నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరీ ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది. శ్రీసాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఈ ఆస్తులు ఠాక్రే బావమరిది (సతీమణి రష్మీ ఠాక్రే సోదరుడు).. శ్రీధర్ మాధవ్ పటాంకర్ పేరు మీద ఉన్నాయి. మొత్తం రూ.6.45 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
పుష్పక్గ్రూప్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత సంస్థ.. శ్రీధర్ మాధవ్‌కు చెందిన శ్రీసాయిబాబా గృహనిర్మితికి నగదును బదిలీ చేసినట్లు తమకు సమాచారం అందిందని ఈడీ వెల్లడించింది. పుష్పక్ గ్రూప్ కేసు నిందితుడు మహేశ్ పటేల్ మరో నిందితుడు నందకిశోర్ చతుర్వేది సాయంతో శ్రీధర్ మాధవ్ సంస్థలోకి నగదును బదిలీ చేసినట్లు తెలిపింది. దాదాపు రూ.50 కోట్లను శ్రీధర్ మాధవ్ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది.
'ఆ రాష్ట్రాల్లోనే ఈడీ పనిచేస్తోంది'
సీఎం ఠాక్రే బంధువు శ్రీధర్ మాధవ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు.