Satyendar Jain ED raids: హవాలా కేసులో అరెస్ట్ అయిన దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ నివాస ప్రాంగణాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. జైన్‌పై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ.. సోమవారం దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో 'ఫాలో అప్'లో భాగంగా దాడులు చేపట్టినట్లు వెల్లడించారు.
మంత్రి ఇంటిపై ఈడీ దాడులు.. మనీ లాండరింగ్ కేసులో కొత్త ఆధారాలు!
Satyendar Jain ED raids: దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసాలు, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ కేసు 'ఫాలో అప్'లో భాగంగా దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
JAIN-RAIDS
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద 57 ఏళ్ల జైన్‌ను మే 30న అరెస్టు చేశారు జూన్ 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉండనున్నారు. కస్టడీలో ఉన్న జైన్‌ను ప్రశ్నించిన ఈడీకి కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. మరికొందరు హవాలా ఆపరేటర్లను ప్రశ్నించిన తర్వాత.. జైన్ ఇంట్లో సోదాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. తమకు లభించిన ఆధారాలపై ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని తాజా దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Jun 6, 2022, 9:18 AM IST